Tuesday, June 28, 2011

బోట్లూ .. స్టీమర్లూ..

పోయిన వారాంతం, మాకు దగ్గరలో ఉన్న Savannah అనే టౌన్ కి వెళ్ళాం. దగ్గరలోనే Tybee అనే బీచ్ కూడా ఉంది. Savannah అనే టౌన్ చాలా ప్రాచీన మైన టౌన్. అమెరికాలో 1800 లో జరిగిన సివిల్ వార్ టైమ్ లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఇళ్ళన్నీ చాలా పురాతనమైనవి, చూడటానికి ఫ్రెంచ్ టౌన్ లా అనిపించింది. డౌన్ టౌన్ లోని రివర్ ఫ్రంట్ చాలా బాగా నచ్చింది నాకు. పెద్ద రివర్ పక్కనే చాలా పొడవున ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్ మీద బోలెడు సందడి. డ్రాయింగ్స్ వేసే వాళ్ళు, తాటాకు (?) తో గమ్మత్తైన బొమ్మలు చేసేవాళ్ళు, మ్యూజిక్ వాయించే వాళ్ళు, acrobats, రకరకాల షాప్స్, రెస్టారెంట్స్ తో చాలా సందడిగా ఉంది. ఆ రోడ్ మీదనే ట్రామ్ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఇక ఆ రోడ్ మీద నుంచి చూస్తే రివర్ లో పెద్ద పెద్ద షిప్స్, బోట్లు, ఆ పక్కనే పెద్ద హోటళ్ళు కనిపిస్తాయి. ఒక వింతైన, కొత్తైన వాతావరణం లోకి వెళ్ళినట్లనిపించింది నాకు.


:)




Monday, June 27, 2011

Friday, June 24, 2011

Wednesday, June 22, 2011

Wednesday, June 8, 2011

Thursday, June 2, 2011

"There is beauty all around us when there's Love in our hearts"